శీలం, గుణం ఎలా ఉండాలి ? - ధర్మ సూక్ష్మం
శీలం, గుణం ఎలా ఉండాలి ? ( ఆధ్యాత్మికం - ధర్మ సూక్ష్మం) ఈ నియమం ఎవరికైనా, ఎంతటివారికైనా, మహానుభావులకైనా, సామాన్యుడికైనా, ధనవంతుడికైనా, గురువులకైనా ఒక్కటే ! కీర్తి రెండు విధములుగా సంపాదించవచ్చు. ఒకటి, సభలు-సమావేశాల్లో ప్రముఖులచే పొగడ్తలతో కూడిన ప్రసంగాలతోనో, కళలతోనో-కరతాళధ్వనులతోనో, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించో సంపాదిస్తే, రెండవది మంచి నడవడికతోను, ధర్మముతో మిళితమైన జ్ఞానంతోను అయి ఉంటుంది. అంటే నీవు సంపాదించిన ధనం, ప్రతిష్ఠ, పలుకుబడి గురించి, నీ ధర్మాచరణ, సత్యము, నీతి, నిజాయితీ, నైతిక విలువ, శీలము, గుణములను చూసి నీ "ఛాయ (నీడ)" గర్వపడాలి. అప్పుడే నీవు సాధించినదానికి సార్థకత. ఎందుకంటే అదొక్కటి మాత్రమే నువ్వు చేసిన ప్రతిపనికి సాక్షి. నువ్వు బాహ్యంగా ఎలా ప్రవర్తించావో, లోలోపల ఏ మనస్తత్వంతో ఎటువంటి శీలంతో ఉన్నావో దానికే తెలుసు. అది నిన్ను వదలదు, నీవు వదిలించుకోలేవు కూడా! నీ పర్వతమంత కీర్తి, ఆకాశమంత మదము, సాగరము లాంటి సంపద, పలుకుబడి, మంది మార్బలం ఎవరూ కూడా దానిని నిర్మూలించలేరు. కారణం...అది అగ్నిలాంటిది. ఎప్పుడైతే నీ "ఛాయ(నీడ)" నిన్ను చూసి గర్వపడుతుం...