ఫకీరులు కాదు, భాగవతోత్తములు
ఫకీరులు కాదు, భాగవతోత్తములు వీరందరు పరమ భాగవతోత్తములు. సమీప కాలములో మన ముందు తరాలకు చెందిన పురుషోత్తములు. అంటే సృష్టికి మూలకర్త అయిన ఈశ్వరుడి నామాన్నే జపిస్తూ, తపస్సు చేస్తూ తన్మయత్వం చెంది ఇతరులకు ఆ భాగ్యాన్ని కల్పించి ఉద్ధరించాలనే తపనతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తూ జీవించారు. అంతే తప్ప ఆత్మస్తుతి చేసుకోలేదు . ఎటువంటి ఆశ్రమాలను, మఠాలను, ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించలేదు సరికదా కాలి నడకన దేశమంతా తిరుగుతూ నామ ప్రచారం చేశారు. ఆ రోజుల్లో టి.వి, మీడియా, టి.వి ఛానెల్స్, సోషల్ మీడియాలు లేవు. రేడియో కూడ కేవలం వార్తలకే పరిమితం. అంతటి క్లిష్టమైన పరిస్థితులలో భగవద్భక్తిని ప్రచారము చేసి ఎన్నో కోట్ల మందికి సత్యాన్వేషణలో మార్గదర్శం అయ్యారు . ఈ నాటికీ, వారు చూపిన సన్మార్గాన్ని అనుసరిస్తూ హిందూ ధర్మ విలువలను కాపాడుతున్న సజ్జను లు ఉన్నారు. ఇంతటి మహనీయుల పరంపరలో నుండి వచ్చిన మనం, వారిని అనుసరించి భగవంతుడి కృపకు పాత్రులు కాకుండా ముక్కు ముఖం తెలియని ఫకీరులను, దొంగలను ఆశ్రయించి సర్వస్వం పోగొట్టుకుంటున్నాము. సనాతన ధర్మం, సంప్రదాయాన్ని తెలిసో తెలియకో మనమే నాశనం చేసుకుంటున్నాము. ఒక్క...