ఫకీరులు కాదు, భాగవతోత్తములు

ఫకీరులు కాదు, భాగవతోత్తములు


వీరందరు పరమ భాగవతోత్తములు. సమీప కాలములో మన ముందు తరాలకు చెందిన పురుషోత్తములు. అంటే సృష్టికి మూలకర్త అయిన ఈశ్వరుడి నామాన్నే జపిస్తూ, తపస్సు చేస్తూ తన్మయత్వం చెంది ఇతరులకు ఆ భాగ్యాన్ని కల్పించి ఉద్ధరించాలనే తపనతో ఆయన నామాన్ని ప్రచారం చేస్తూ జీవించారు. అంతే తప్ప ఆత్మస్తుతి చేసుకోలేదు. ఎటువంటి ఆశ్రమాలను, మఠాలను, ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించలేదు సరికదా కాలి నడకన దేశమంతా తిరుగుతూ నామ ప్రచారం చేశారు. ఆ రోజుల్లో టి.వి, మీడియా, టి.వి ఛానెల్స్, సోషల్ మీడియాలు లేవు. రేడియో కూడ కేవలం వార్తలకే పరిమితం. అంతటి క్లిష్టమైన పరిస్థితులలో భగవద్భక్తిని ప్రచారము చేసి ఎన్నో కోట్ల మందికి సత్యాన్వేషణలో మార్గదర్శం అయ్యారు. ఈ నాటికీ, వారు చూపిన సన్మార్గాన్ని అనుసరిస్తూ హిందూ ధర్మ విలువలను కాపాడుతున్న సజ్జనులు ఉన్నారు.




 
 

ఇంతటి మహనీయుల పరంపరలో నుండి వచ్చిన మనం, వారిని అనుసరించి భగవంతుడి కృపకు పాత్రులు కాకుండా ముక్కు ముఖం తెలియని ఫకీరులను, దొంగలను ఆశ్రయించి సర్వస్వం పోగొట్టుకుంటున్నాము. సనాతన ధర్మం, సంప్రదాయాన్ని తెలిసో తెలియకో మనమే నాశనం చేసుకుంటున్నాము.

 

ఒక్క విషయం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. మనుష్యులు మాత్రమే నోటితో రెండు పనులు చేయగలరు. ఒకటి ఆహారం తినడం, రెండవది మాట్లాడటం. మిగతా జంతు జీవాలన్నీ తినడము మాత్రమే చేయగలవు. మాట్లాడలేవు. కనుక, ఇంతటి భాగ్యం మరలా మనకు వస్తుందో లేదో తెలియదు. అందువలన, మితముగా మాట్లాడటం, మంచే పలుకడం, అవకాశం ఉన్నప్పుడల్లా పరమాత్మ నామం స్మరించడం చేయాలి. సత్యం మాట్లాడుటే ధర్మం, విస్మరిస్తే  మరుజన్మ ‘మాట్లాడలేని’జన్మమే.

 

జీవితములో ఎంతో విలువైన కాలాన్ని వృధా చేస్తుంటాము. ఒక్క 7 రోజులు శ్రీమద్భాగవత శ్రవణం చేస్తే (వింటే చాలు, చదివే శ్రమ కూడా అక్కరలేదు) మనం ఎటువైపు వెళ్ళాలో తెలుస్తుంది, ఎవరిని అనుసరించాలో తెలుస్తుంది. నామ స్మరణ మహిమ తెలిస్తే, నీకు నువ్వే సమస్యలు పరిష్కరించుకోగలిగే శక్తి, స్థితి వస్తుంది. ఆ నామ రుచి తెలిస్తే ఇక నీ జన్మ ధన్యమే. జీవితం ఎంతో సుఖముగా సాగిపోతుంది.

 

ఒక ప్రక్క ముస్లింలు బయట విక్రయించే ఆహారాలలో గర్భ నిరోధక మాత్రలు కలిపి హిందూ మతానికి చెందిన యువతులకు సరఫరా చేస్తున్నారని ఈ మధ్యే బయటపడింది. మరో ప్రక్క క్రైస్తవులతో కలిసి హిందూ మతాన్ని క్షీణపరిచే దిశగా మతమార్పిడులు చేస్తూ యువతీ యువకులను మానసికంగా దెబ్బతీస్తున్నారు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వారే సంఘ విద్రోహ శక్తులుగా పరిణమిస్తున్నారని నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య ముస్లింలు ఖురాన్ తీసుకుని షిర్డి సాయి ప్రార్థనా స్థలాలకు రావడం, వారిని అచటి కార్యవర్గం అనుమతించడం వీడియోలలో చూశాము. దీని వెనుక పెద్ద కుట్ర దాగియున్నట్లు హిందూ ధర్మ కర్తలు హెచ్చరించారు కూడ. అయోధ్య శ్రీరాముడి మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వరు గాని, ముస్లింలను సాయిబాబా విగ్రహ ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. ఎంతటి ప్రమాదములో పడ్డామో ?

 

సనాతన సంప్రదాయ విలువలను పాటించి ఉత్తములుగా తయారై ఈ దేశాన్ని కాపాడుకోవడమా లేక ఇతరుల చేతిలో మోసపోయి భ్రష్టుపట్టడమా అనేది తేల్చుకోవాల్సింది మనమే. ఈశ్వరుడు ఒకటి - రెండు సార్లు మాత్రమే అవకాశమిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 


శ్రీ భగవతే వాసుదేవాయ నమః 🌹👏


                                                                                                     శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper