కలిపురుషుడు విర్రవీగుతున్నాడు ! Excerpts from “Kurukshetra” - PART 2

కలిపురుషుడు విర్రవీగుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త !

Excerpts from “Kurukshetra” - PART 2
(By Srirāmapāda Bhāgavathar)

శ్రీకృష్ణుని రథసారథి ఉద్ధవుడు "మాధవా ! ద్వాపరయుగంలోనే ఇలా ఉంటే, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది" అని అడిగాడు. దీనికి పరమాత్ముడు "పాండవులు కూడా ఇదే విషయం తనని అడిగారని, వారినే తెలుసుకోమని చెప్పానని" ఈ విధంగా ఉదహరించాడు.

శ్రీకృష్ణుడు పాండవులను నాలుగు వైపులా బాణాలను వదిలి, తరువాత వాటిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళి తీసుకుని వచ్చారు. శ్రీకృష్ణుడు బాణాలు పడిన ప్రదేశాలలో ఏమి చూశారని ప్రశ్నించాడు. అందుకు

(1) భీముడు, "బాణం నాలుగు బావుల దగ్గర పడిందని, వాటిలో మూడు నిండుగా ఒక్కటి ఒకింత నీటితో నిండి ఉన్నాయని" చెప్పాడు.

(2) అర్జునుడు, "బాణం ఒక వృక్షం ముందు పడిందని, దానిపై కోకిల అందంగా కూస్తోందని, మధ్యమధ్యలో ఎలుకని తింటోందని" చెప్పాడు.

(3) నకులుడు, "బాణం ఒక గోశాలలో పడిందని, తల్లి గోవు దూడని నాలుకతో నాకుతూ ముద్దాడుతోందని” చెప్పాడు.

(4) సహదేవుడు, "బాణం ఒక పెద్ద కొండరాయి ముందున్న చిన్న చెట్టు ముందర పడిందని” చెప్పాడు.

తాము చూసిన వాటి గురుంచి పాండవులు శ్రీకృష్ణుడిని "ఎందుకు ఇలా, దీని అంతరార్థం ఏమిటి?" అని అడిగారు. శ్రీకృష్ణుడు చెప్పసాగాడు,



(1a) భీముడు చూసిన బావులలోని నీటిని గురించి : "ద్వాపర యుగంలో మూడింతలు ధర్మముంటే, కలియుగంలో ఒకింత మాత్రమే"నని.

(2a) అర్జునుడు చూసిన కోకిల ఎలుకని తినడం గురించి : "కలియుగంలో కులగురువులు, సత్యమైన జగద్గురువులు విస్మరించబడతారని, కలిగురువులు పుట్టుకొచ్చి నమ్మశక్యంగా తియ్యటి వచనాలు చెపుతూ, వెనుకన అదే నాలుకతో మోసపూరితంగా వ్యవహరిస్తారని".

(3a) నకులుడు చూసిన గోవు, దూడని ముద్దు చేసుకోవడం గురించి : "అతిగా ముద్దు చేసి తల్లితండ్రులే పిల్లల్ని పాడు చేస్తారని".

(4a) సహదేవుడు చూసిన పెద్దరాయి దొర్లుకుంటూ ఒక చిన్నచెట్టు ముందు ఆగిపోవడం గురించి : "అధర్మం, అన్యాయం, అవినీతి పెద్దమొత్తంలో విచ్చలవిడిగా జరుగుతూ మీద పడుతుందని, దానిని కించిత్  భగవన్నామ స్మరణతో అదుపు చేసుకోవచ్చని".

గమనిక :

సరిగ్గా నేడు జరిగేవి ఇవే ! ఎంతో మంది పాలకులు, ప్రజలు, మట్టి కాళ్ళ మోడరన్ ఆచార్యులు, పీఠాధిపతులు తదనుగుణముగా ఆధునిక పండితులు ఇలాగే ఉన్నారు. తెలుసుకుని ధర్మాన్ని పట్టేవాడు తెలివికలవాడు-ధన్యుడు, విస్మరించేవాడు అవివేకి, పాపి అని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించాడు.

గుణపాఠం :

శ్రీకృష్ణుడు హెచ్చరికతో జాగ్రత్త పడితే మంచిది. మనం శుద్ధిగా ఉంటూ, నిత్యం దీపారాధన చేసి ఆరాధన చేస్తే పరమాత్మ శక్తి మన ఇంటిలోనే ఉందని అర్థమవుతుంది. సమాజంలో ఎటుచూసినా మోసం! ఎక్కడికో వెళ్ళి 'మాయలో పడి' కాలాన్ని వృధా చేస్తూ 'అవ' దూతల మురికి పాదాలు పట్టుకుని డబ్బుని వృధా చేయడం కంటే, ధర్మ సూక్ష్మాలను తెలుసుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు🌹

- శ్రీరామపాద భాగవతర్
- ఆధ్యాత్మికవేత్త, భక్తి సంగీత గాయకుడు

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper