ధనవంతులవడం "కలి" లక్షణమా ?
ధనవంతులవడం "కలి" లక్షణమా ?
భోగములు - అసూయ, దేనికి సంకేతం ?
సామాన్యుల గతి ఎటువైపు ?
సెప్టెంబర్ 3, 2021 : ఎవరైతే దుర్బుద్ధి, అక్రమ సంబంధం, అసత్యం, అవినీతి, అధర్మం, అన్యాయం, మోసం, జూదం, మద్యపానం, ద్వేషం (క్రోధం - హింస) లక్షణాలు కలిగియుంటారో అటువంటి వారు కలి ప్రభావానికి దాసులయ్యారని అర్థం. బాహ్యంగా చూడటానికి వీరు భోగములతో వైభవంగా ఉన్నట్లనిపిస్తుంది కాని, కలిపురుషుడు వీరిని పాపకూపంలోకి లాగాడని అర్థం. ఇది సరిగా అర్థంచేసుకోలేక, సామాన్యులు కొంతమంది "మనకి మాత్రమే ఈ పేదరిక బాధలు, కష్టాలు ఎందుకు? " అని భగవంతుడిని నింద-స్తుతి చేస్తుంటారు. నిజానికి భగవంతుడు పరీక్షించేది వీరిని కాదు, పైన ఉదహరించిన వారిని. కలి ప్రభావానికి లోనైనవారు మాత్రం తమ భోగాలు చూసి మురిసిపోతుంటారు కాని, ఇది ముందు ముందు జన్మలకి ఎంత ప్రమాదమో గ్రహించలేరు.
ఈ సూత్రం ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికైనా ఒక్కటే. ఎక్కడి నుండి వచ్చామో, ఏ రూపాంతరం చెందామో ఎవరికీ తెలియదు. ఒక్కటి మాత్రం సత్యం-కంటిముందే సాక్ష్యం. ఎన్నో జీవరాసులు, చీమ, పాము, కుక్క, పులి, పంది, పక్షులు, పురుగులు, క్రిమికీటకాలు, రాళ్ళు, వృక్షాలు మరెన్నో లక్షల జీవులు. వాటికి ఆ జీవితం, మనది మనుష్య జన్మ. ఎలా ? ఇది అలోచిస్తే జ్ఞానం. నిర్లక్ష్యిస్తే అజ్ఞానం.
మెరిసేదంతా బంగారం కాదు. అనవసర భోగాలకు తాపత్రయపడి ఆర్భాటాలు, అప్పులు చేయడం, తట్టుకోలేక వనాలు, భవనాలు (కృత్రిమం) చూసి దైవం ముసుగులో వ్యాపారం చేసే లౌకికులు, దొంగ స్వామీజీల మాయలో పడటం, అసూయ, అధర్మ మార్గాన పడటం పతనానికి నాంది, నీచజన్మకి కారణాలు.
గరుడపురాణం చదవండి. మన జీవిత లక్ష్యాన్ని, ఫలితాలను తెలియచేస్తుంది. "తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం"
- శ్రీరామపాద భాగవతర్
(నేడు శ్రావణమాస శని ప్రదోషం)
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.