Posts

నీ అక్రమ సంపాదన, మంది మార్బలం నీ వెంటరావు

Image
“కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది.  నీ అక్రమ సంపాదన, మంది మార్బలం, పలుకుబడి నీ వెంటరావు.  అన్నీ ముళ్ళ పొదలే" సమాజములో నేడు నెలకొన్న కొంతమంది వికృత ప్రవర్తన, హిందూ సంప్రదాయాల పట్ల విచ్చలవిడి ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలు, అసభ్యకరమైన నడవడిక మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు తక్షణమే దృష్టి పెట్టి భారతదేశ మహోన్నతమైన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కాపాడాలని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ కోరారు. మహాభారత యుద్ధం పిదప శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అన్న మాటలను, గరుడ పురాణాంతర్గత కర్మ, శిక్షలను ఆయన ఈ సందర్భముగా ఉటంకించారు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, నీ నేరాలను పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు శిక్షించ లేకపోయినా, నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుందని, వదలక వెంటాడి వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుందని, కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరని శ్రీరామపాద గుర్తుచేశారు. త్రవ్వి త్రవ్వి చూసుకుంటే, నీ జాడ నీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది. ఇప్పటికైనా పశ్చాత్తాప పడి, మంచి మార్గాన్ని పట్టు. లేదంటే ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. పు...

“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ?

Image
“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ? “రామరాజ్యం” : ఆ పరిపాలన, పదానికి ఉన్న విలువను కాపాడాలి ! ----------- “రామరాజ్యం” అంటే పాలకునికి కావలసిన ఎన్నో మహోన్నత గుణముల సమాహారం. అందులో అత్యంత ముఖ్యమైనవి కొన్ని. 1) తన, పర భేదము లేకుండా సత్యనిష్ఠతో  ధర్మాచరణ  చేయడం. 2) కఠినమైన నీతి, న్యాయముతో వ్యవహరించడం. 3) ఋషి పరంపర నుండి వచ్చిన గురు-వాక్యాన్ని పాటించడం. 4) అస్మదీయ రక్షణ, పరుల శిక్షణ తగదు. 5) అన్ని మతాలను వర్గ భేదం లేకుండా సమదృష్టితో చూడటం. 6) ప్రజలను మోసపూరితముగా నమ్మించడం తగదు. 7)   ధనిక, పేద భేదం ఉండకూడదు. 8) ప్రజలకు కష్టం, నష్టం, బాధ, శోకం, విచారం, ఆపద, మానసిక అశాంతి - క్షోభ ఏ కోశాన కలిగించకూడదు. 9) స్వయముగా ప్రత్యక్షముగా వేద పోషణ, గో పోషణ, దేవాలయ పోషణ, నది - నదీ పరివాహక ప్రదేశాల రక్షణ, యాగాలు అణునిత్యం జరిగే విధముగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ నిర్వహించేవారిని గుర్తించి గౌరవించడం, అన్ని రకాల చేయూతనివ్వడం. 10)   నిత్యం ప్రజలను ప్రాంతాలవారీగా కలిసి వారి బాధలు తెలుసుకుని నిస్పక్షపాతముగా వారికి అనువైన నిర్ణయాలు తీసుకోవడం. అర్థరాత్రి ఎవరైనా గంట కొడితే, వారికి ఏ ఆపద వచ్చిం...

ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి .. ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్‌లో నా వ్యాసం

Image
 ఆధ్యాత్మికం వ్యాపారమా ? ఎవరు ప్రక్షాళన చేస్తారు ? ( ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్) ప్రపంచంలో గురువుని తప్ప ఎవరినీ నమ్మవద్దు అని సుప్రసిద్ధ హితోక్తి. అయితే, ఎల్లప్పుడూ విఐపిలు సందర్శిస్తే ఆయన నమ్మకమైన గురువా? పెద్దెత్తున కార్యక్రమాలు, యాగాలు చేస్తే జగద్గురువా? నిత్యం టీవీల్లో కనపడితే మహాస్వామియా? విదేశాలు తిరిగితే యోగులా? ఆభరణాలు సృష్టిస్తే అవతారపురుషుడా? పెద్దెత్తున కట్టడాలు కడితే పరమహంస పరివ్రాజకుడా? కోట్ల ధనం వసూలు చేస్తే సిద్ధులా? రాగద్వేషాలు కలవారు, లాబీయింగ్ చేసేవారు పీఠాధిపతులా? ఎవరు నిజమైన గురువు? నేటి గురువులు ‘శిష్యుడు ఎంత ఇవ్వగలడు? వేటిని సమకూర్చగలడు? ఏ విఐపిని తీసుకునిరాగలడు?’ అనే చూస్తున్నారు. ఇంకొకరికి పోటీగా ఎదగడమే లక్ష్యం తప్ప సనాతన ధర్మరక్షణ ఏ కోశాన కనిపించట్లేదు. ఆశ్చర్యమేమంటే, వీరు తలబెట్టే కార్యక్రమాలు మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటాయి. అయితే అవి జనాకర్షణ, ధనార్జన కోసమే. తమ ఆశ్రమవాసులను పవిత్రంగా ఉన్నతస్థితిలోకి తీసుకురాలేరు కాని లోకానికి ప్రవచనాలు చెప్తుంటారు.  సనాతనధర్మాన్ని నిక్కచ్చిగా ఆచరించే గురువులు ఈ కర్మభూమిని దాటివెళ్ళక నిషేధం పాటిస్తారు. బ్రహ్మనిష్ఠుడై, బ్...

కార్తీక నది స్నానం చేయలేకపోయారా ? బాధ పడనవసరం లేదు !

Image
కార్తీక నది స్నానం చేయలేకపోయారా ?  బాధ పడనవసరం లేదు !   కార్తీకమాసంలో నది స్నానం చేయలేకపోయిన వారు, నదికి వెళ్ళలేనివారికి  ప్రత్యామ్నాయమైన  ఒక  ధర్మసూక్ష్మం. ప్రత్యేకించి నేడు నెలకొన్న విపత్కర పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వలన ఇబ్బంది పడుతున్న పలు ప్రాంతాల ప్రజలకు ఈ ప్రత్యామ్నాయం దోహదపడుతుం ది .   ఒక ఉసిరి కాయ  లేదా  పండు,  ఒక  తులసిదళం నీటిలో వేసి సూర్యోదయానికి కనీసం 15 ని.లు ముందే శ్రీహరి నామస్మరణతో, నమఃశివాయ అని స్మరిస్తూ, సప్తనదీ శ్లోకం పఠిస్తూ లేదా గంగ .. గంగ .. గంగ అని 3 మార్లు జపిస్తూ స్నానమాచరించి,  పరిశుభ్రమైన వస్త్రాలు సంప్రదాయ పద్ధతిలో ధరించి  ఆ వెనువెంటనే   దీపారాథన చేయా లి. సప్తనది ప్రార్థన :   గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి  నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు   దీపారాథన మంత్రం :   దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీపో నమోస్తుతే   ఇది కార్తీకమాస పర్యంతం, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి, సోమవతి అమావాస...

పోలింగ్ రోజు - క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని శాసిస్తుంది లేదా శపిస్తుంది !

Image
సామాజిక బాధ్యత ఓటు హక్కు కోల్పోకూడదు ! ఒక్క క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని  శాసిస్తుంది లేదా  శపిస్తుంది ! విద్యావంతులు, ఉద్యోగులు, జ్ఞానులు ఓటు వే స్తే  ...  రౌడీ, గూండ, అబద్ధాల పుట్టలు, ముఠాలు ఖాళీ ! మెరుగైన సమాజం కోసం  యువత, విద్యావంతులు తప్పక ఓటెయ్యాలి ! మంచి నడవడిక గల అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి ! ఎవరికి వారు మనొక్కరమే కదా, ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఏమౌతుందులే అనుకుంటే దుష్టులకు చేయూతనిచ్చినట్లు అవుతుంది. 5 ని.లు ఓటు వేయడానికి బయటకి రాము. ఇది మానసిక, శారీరిక దౌర్భాగ్యం కాక మరేమిటి ? కోట్ల మంది  మానసిక క్షోభ అనుభవిస్తున్నాం ! ఇప్పుడు సరైన సమయం ఆసన్నమైంది. ఇంట్లో కూర్చున్నా, సెలవు కదా అని ఓటు వేయకుండా పిక్‌నిక్, ఊరు వెళ్ళినా  ఆ దుష్ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుంది.  రాబోయే 5 సం.లు ఇబ్బంది పడేది మనమే ! ప్రతిరోజూ ఉదయం పార్కులలో, ఆఫీసులలో, హోటల్స్‌లో, వేడుకలలో, ఇంటికి అతిథులు వచ్చినపుడు లోకజ్ఞానం, ప్రతిభ కనబరుస్తూ రాజకీయాల గురించి, ప్రభుత్వం అలా చేస్తే బా గుం డు, ...