కార్తీక నది స్నానం చేయలేకపోయారా ? బాధ పడనవసరం లేదు !
కార్తీక నది స్నానం చేయలేకపోయారా ?
బాధ పడనవసరం లేదు !
కార్తీకమాసంలో నది స్నానం చేయలేకపోయిన వారు, నదికి వెళ్ళలేనివారికి ప్రత్యామ్నాయమైన ఒక ధర్మసూక్ష్మం. ప్రత్యేకించి నేడు నెలకొన్న విపత్కర పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వలన ఇబ్బంది పడుతున్న పలు ప్రాంతాల ప్రజలకు ఈ ప్రత్యామ్నాయం దోహదపడుతుంది.
ఒక ఉసిరి కాయ లేదా పండు, ఒక తులసిదళం నీటిలో వేసి సూర్యోదయానికి కనీసం 15 ని.లు ముందే శ్రీహరి నామస్మరణతో, నమఃశివాయ అని స్మరిస్తూ, సప్తనదీ శ్లోకం పఠిస్తూ లేదా గంగ .. గంగ .. గంగ అని 3 మార్లు జపిస్తూ స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాలు సంప్రదాయ పద్ధతిలో ధరించి ఆ వెనువెంటనే దీపారాథన చేయాలి.
సప్తనది ప్రార్థన :
గంగే
చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే
సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
దీపారాథన
మంత్రం :
దీపం
జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దనః
దీపో
హరతు మే పాపం సంధ్యాదీపో నమోస్తుతే
ఇది కార్తీకమాస పర్యంతం, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి, సోమవతి అమావాస్య రోజులలో చేయడం వలన సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభించడమే కాక హరిహరుల కృప అపారంగా కలుగుతుంది.
ఓం కార్తీక దామోదరాయ నమః 🙏
ఓం నమః శివాయ !🙏
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.