ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?
గురు-పరంపర అవసరమా ? ఎందుకంత ప్రాముఖ్యత ? గడ్డాలు పెంచుకుని, కాషాయం ధరించలేని వాడు గురువా ? భక్తి పేరుతో, నిత్యం విమానాల్లో ఫస్ట్ క్లాస్‌లో విదేశాలు తిరిగేవాడు జగద్గురువా ? అలా ఐతే ఈ ప్రపంచంలో వేల జగద్గురువులు ఉన్నట్లే ! లౌకిక వాంఛ గలవాడు గురువు కాగలడా ? రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు అక్రమంగా చేసేవాడు అవతార పురుషుడైపోయాడు ! రాహువు లాలాజలం నుండి ఉద్భవించిన ఉల్లి, వెల్లుల్లి తినేవారు, మద్యం సేవించి స్త్రీలతో సాంగత్యం చేసేవాడు గురువుగా అర్హుడా ? స్త్రీలతో వ్యక్తిగతంగా మాట్లాడేవాడు సన్యాసా? తన తప్పులు కప్పిపుచ్చడానికి నిత్యం లంచాలు ఇచ్చేవాడు పూజ్యనీయుడౌతాడా? బ్రహ్మచార్యులమని చెప్పుకుని విచ్చలవిడిగా అక్రమాలు చేసేవారు గురువుకి వ్యక్తిగత కార్యదర్శులా? అటువంటప్పుడు ఆ గురువు పవిత్రుడౌతాడా? ఒకానొక ప్రముఖ ఆచార్యుడని చెప్పుకునే సన్యాసి విదేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని విన్నాం. దీనిని ఏ విధముగా అర్థం చేసుకోవాలి ? ఇది అసత్యమని నిర్థారించేది ఎవరు ? రాగ ద్వేషాలు కలిగి, దొంగ మార్గాన దండాన్ని దొంగిలించి ఆచార్యుడు, మ...