బ్రాహ్మణులు బాగుండాలి, ధర్మానుష్ఠానము చేయాలి

బ్రాహ్మణులు బాగుండాలి, ధర్మానుష్ఠానము చేయాలి


देवाधीनम् जगत सर्वं, मंत्राधीनाश्च देवता
ते मंत्रा ब्राह्मणाधीना, तस्मात् ब्राह्मण देवता

దీని అర్థం "ఈ జగత్తు అంతా దైవం ఆధీనములో ఉంటుంది. అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉంది. ఆ మంత్రం బ్రాహ్మణునకు లోబడుతుంది". దీన్ని బట్టి బ్రాహ్మణుడు యొక్క ధర్మానుష్ఠానం ఎంతటి శక్తి కలదో ఆలోచించండి. బ్రాహ్మణుడు, ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేయాలి. అటువంటివారిని వెతుక్కుని మరీ ఈశ్వరుడు ఇంటికి వస్తాడు.

లేనియెడల నీవు వేరే వాళ్ళ వెంటపడాల్సి వస్తుంది. ఇదే దౌర్భాగ్యమంటే ! ధర్మానుష్ఠాన నిర్లక్ష్యం కుటుంబాన్ని ఎన్నో రకాలుగా పీడిస్తుంది. గత జన్మల పుణ్యం వలన, ఇంతటి మహోన్నత జన్మ కలిగింది. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే, భ్రష్టుపట్టి, మరల ఎన్ని వేల జన్మలు అనుభవించిన తరువాతో గాని ఈ జన్మ లభించదు.


బ్రాహ్మణులు బాగుండాలి, ధర్మానుష్ఠానము చేయాలి. ఉద్యోగపరముగా, సంతాన పురోగతి పరముగా, ఆరోగ్య పరముగా, ఆర్థికముగా వృద్ధి చెందాలంటే మనకున్న బ్రహ్మాస్త్రం నిత్య సంధ్యావందనం, అనుష్ఠానమే. దీని వలన సమాజానికి, దేశానికి కూడ ఎంతో ఉపయోగము. అందుకనే రాజులు బ్రాహ్మణులనే గురువులుగా, దిశానిర్దేశకులుగా పూజించారు. ఫలితముగా దేశం సుభిక్షముగా, ప్రజలు సుఖ-సంతోషాలతో జీవించారు. మన ఊరు బాగుంటేనే మనమూ సుఖముగా జీవించగలం. నేటి పరిస్థితులు బాగా లేవు. బ్రాహ్మణులు సమాజములో నిర్లక్ష్యానికి గురౌతున్నారు. ఇది ఎంతో బాధ కలిగిస్తోంది. మనలను మనమే కాపాడుకోవాలి. ప్రతి బ్రాహ్మణ కుటుంబం విధిగా మన నిష్ఠ - నియమాలను పాటిస్తే ఫలితాలు అమోఘం. ఇంకొకరి కాలు పట్టుకునే దుస్థితి రాదు. ఇందులో సందేహం లేదు. అందువలన, ఆ జగన్మాత గాయత్రి దేవి ఉపాసన ప్రతియొక్కరు చేయాలనే ప్రేరణ అందరికి కలుగాలని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు. వయసుతో నిమిత్తం లేదు. తక్షణమే మొదలుపెట్టండి.

- శ్రీరామపాద భాగవతర్,  ఆధ్యాత్మికవేత్త


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper