పోలింగ్ రోజు - క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని శాసిస్తుంది లేదా శపిస్తుంది !
సామాజిక బాధ్యత ఓటు హక్కు కోల్పోకూడదు ! ఒక్క క్షణ నిర్ణయం 5 సం.ల జీవితాన్ని శాసిస్తుంది లేదా శపిస్తుంది ! విద్యావంతులు, ఉద్యోగులు, జ్ఞానులు ఓటు వే స్తే ... రౌడీ, గూండ, అబద్ధాల పుట్టలు, ముఠాలు ఖాళీ ! మెరుగైన సమాజం కోసం యువత, విద్యావంతులు తప్పక ఓటెయ్యాలి ! మంచి నడవడిక గల అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి ! ఎవరికి వారు మనొక్కరమే కదా, ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఏమౌతుందులే అనుకుంటే దుష్టులకు చేయూతనిచ్చినట్లు అవుతుంది. 5 ని.లు ఓటు వేయడానికి బయటకి రాము. ఇది మానసిక, శారీరిక దౌర్భాగ్యం కాక మరేమిటి ? కోట్ల మంది మానసిక క్షోభ అనుభవిస్తున్నాం ! ఇప్పుడు సరైన సమయం ఆసన్నమైంది. ఇంట్లో కూర్చున్నా, సెలవు కదా అని ఓటు వేయకుండా పిక్‌నిక్, ఊరు వెళ్ళినా ఆ దుష్ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. రాబోయే 5 సం.లు ఇబ్బంది పడేది మనమే ! ప్రతిరోజూ ఉదయం పార్కులలో, ఆఫీసులలో, హోటల్స్‌లో, వేడుకలలో, ఇంటికి అతిథులు వచ్చినపుడు లోకజ్ఞానం, ప్రతిభ కనబరుస్తూ రాజకీయాల గురించి, ప్రభుత్వం అలా చేస్తే బా గుం డు, ...