ఋషి పంచమి వ్రతం - ప్రతి స్త్రీ చేయవలసిన విధి

ఋషి పంచమి వ్రతం ఎలా ఆచరించాలి ?

స్త్రీలు చేయవలసిన విధి


ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం ఆచరించే వాళ్ళు తక్కువ. పంచమి నాటి తెల్లవారు ఝామున స్త్రీలు స్నానం చేసి పుష్ప సంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజజేసి, దాన్ని సమూలంగా పెరికివేసి, కొమ్మతో దంతధావనం చేయాలి. పుణ్య స్త్రీలు విభూది, గోపి చందనం, పంచ గవ్యములతో స్నానం చేయాలి. ఈ తంతు ముగియగానే ఆకాశంలోని అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి. సప్త ఋషులైన కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ మహర్షులను స్మరించాలి.






పూజలో నాలుగు ఒత్తుల దీపం వెలిగించాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి. వివాహితలు ఈ వ్రతం వల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని వ్రతోత్సవ చరిత్ర స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదిన వ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.

ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మజన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం !


 శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper