ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు !
ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు ! మరి మార్గం ఏమిటి ? శులభమైన మార్గాలు చేతిలో పెట్టుకుని ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనుకోవడం అవివేకం. ఎక్కడో డబ్బు కట్టేస్తే దోష పరిహారం అయ్యిందనుకుంటే పొరపాటే. అలాగే మన తరఫున మరొకరు ఎక్కడో చేయడం, చేయించడం వలన ప్రయోజనం అధమం. ఇది తెలియక, తెలుసుకోక సనాతన సంప్రదాయాలు వదిలేసి "అపస్మారకాసుర“ మాయలో పడి మూడవ వ్యక్తి పాదాలు పట్టుకోవడం మూర్ఖత్వం. ఆ సదరు వ్యక్తి ముక్కు పిండి పలు విధాల వసూలు చేస్తూనే ఉంటాడు. మన ధనం పోతూనే ఉంటుంది. సాధించేది మాత్రం ‘శూన్యం’. కనుకనే, సనాతన ధర్మాన్ని పద్ధతిగా ఆచరించడమైనా తెలుసుకోవాలి లేదా వేద-శాస్త్ర సమ్మతమైన గురువుని/ఆచార్యుడిని ఆశ్రయించడమైనా తెలియాలి. ఎప్పుడైతే నిర్మలమైన, నిశ్చలమైన మనసుతో, స్వయంగా పరమాత్మ నామం పలుకుతూ, స్వహస్తాలతో సత్కార్యం మనమే చేసుకుంటామో అప్పుడు మాత్రమే పాపరాశి దహించుకుపోతుంది. ఇదే శీఘ్రమార్గం. అందుకనే పెద్దలు ‘త్రికరణశుద్ధి’గా అని అన్నారు. అప్పుడే కాలం, కర్మ, విధాత కలసివస్తాయి. ప్రతి సమస్యకి సనాతన ధర్...