వినాయక చవితి : గణేషుడు ప్రసన్నుడైతే, శ్రేయస్కరం !

వినాయక చవితి


मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं
कलाधरावतंसकं विलासिलोकरक्षकम्
अनायकैकनायकं विनाशितेभदैत्यकं
नताशुभाशुनाशकं नमामि तं विनायकम् 
🌹🎶🔔🙏🏼


ఓం కలౌ కపి వినాయకౌ ! వినాయకచవితి పర్వదినం మొదలుకొని గణపతి నవరాత్రులలో వరసిద్ధి వినాయకుడుని కోరుకొనవలసినది క్షమాపణ పూర్వక సద్బుద్ధి మాత్రమే. అంతేగాని, ఒక కొబ్బరికాయ, నాలుగు ఉండ్రాళ్ళు సమర్పించి కోటి కోరికలు నివేదించకూడదు. ఆ స్వామి కరుణిస్తేనే తగిన జ్ఞానము, సంవత్సర పర్యంతం వివిధ దేవతలకు చేసే వ్రతం - పూజలకు, జప - హోమ – పారాయణలకు, తీర్థయాత్ర - క్షేత్ర దర్శనములకు ఫలితం, అనుగ్రహం లభిస్తుంది 🙌


 

గణేషుడు ప్రసన్నుడైతే, మనకు సూక్ష్మ బుద్ధిని ప్రసాదించి ఏది సన్మార్గమో, ఏది నిజమైన జీవితమో, ఎవరి స్నేహం సహవాసం ఉత్తమమో, ఇటు లౌకికములో (కుటుంబము, సమాజము), అటు ఆధ్యాత్మికములో ఎవరు ధర్మాచరణ చేస్తున్నారో, ఎవరిని నమ్మాలో తెలియజేసి కలి నుండి కాపాడుతాడు. లేని యెడల కలి ప్రభావములో కొట్టుమిట్టాడటమో, కొట్టుకుపోవడమో జరుగుతుంది. ముల్లోకాలలో సమస్త దేవతలు, గణాలు ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తారు. ఈ విషయాన్నే పరమేశ్వరుడు కుమారస్వామి ద్వారా సమస్త మానవాళికి ఉపదేశించినది "వినాయక చతుర్థి మహాత్మ్యం". దీన్ని బట్టి వినాయక చవితి పూజ ఎంత ముఖ్యమో, ఎంతటి భక్తి ప్రపత్తులతో చేయాలో అర్థమవుతుంది. నేటి పూజ ప్రాధాన్యత నారదుడు శ్రీకృష్ణుడుకి ఉద్బోధించిన శ్యమంతకోపాఖ్యానములో తెలుస్తుంది.





ఇంతటి ప్రాముఖ్యమున్న సనాతన సంప్రదాయాన్ని విస్మరించినా, పూజించేవారికి నిర్లక్ష్యంతో ఆటంకము కలిగించినా, అటువంటి వారు కష్టాలలో పడతారు. యుగయుగాలుగా భారతదేశములో వినాయకుడుని విధిగా అర్చిస్తూ ఉండడము వల్లనే ఏ కార్యం తలబెట్టినా సఫలీకృతులై సిరి సంపదలతో, శుభిక్షముగా వర్ధిల్లారు. ఇప్పటికీ, దేశవిదేశాలలోని భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని దేదీప్యమానముగా జరుపుకుంటారు 👌

 

ప్రత్యేకించి, నేడు నెలకొన్న కష్ట కాలములో విఘ్ననాశకుడిని అన్ని విధములా అర్చించడం, ఇటు పాలకులకు, అటు ప్రజలకు ఎంతో శ్రేయస్కరం ! ఆర్భాటాలు ముఖ్యం కాదు. సరళముగా చేసినా భక్తియే ప్రధానం. 


గం గణాథిపతయే నమః 🙏🏼

🎻🎶🎼🥁🎵🔔🎺📯🎷🎹🥁


                                                                                         శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.


Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper