మనలో చిచ్చు పెడుతున్నారు - జాగ్రత్త !
హెచ్చరిక - మనలో చిచ్చు పెడుతున్నారు - జాగ్రత్త !
హిందువులలోని మనలో మనకు, ఇతర మతములోని కొందరు ఉన్మాదులు, మతమార్పిడి చేసుకున్నవారు ద్వేషం సృష్ఠిస్తున్నారు. దినపత్రికలు, టి.వి, సోషల్ మీడియాలలో ఈ వార్తలు చూస్తున్నాం.
హిందు సనాతన ధర్మం, వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల పరంగా ఎంతో ఉన్నతమైన సంప్రదాయంతో కూడిన సంస్కారంతో "సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు" అనే మహోన్నతమైన ఆకాంక్ష కలిగి, ఎల్లప్పుడూ సమాజ హితం, విశ్వశాంతి కోరుకునే ఉన్నతమైన హిందూ కుటుంబం మనది.
అజ్ఞానుల, ఉన్మాదుల ఉచ్చులో పడకుండా విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించవలసిన అవసరం ఆసన్నమైంది. నా దృష్టికి ఎన్నో వికృతమైన, అసత్యమైన సమాచారాలు వచ్చాయి. అవన్నీ అభూత కల్పనలే. కలి విర్రవీగుతున్నాడనడానికి ఈ దుశ్చర్యలే సాక్షి. హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, వైశిష్ట్యం తెలిసినవారు వీటిని హర్షించరు.
మనలోని గొప్పతనం అన్ని సంప్రదాయాలను (ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైతం) గౌరవిస్తాం, వాటిని పాటించే క్షేత్రాలను, గురువులను దర్శిస్తాం. ఈ ఐకమత్యం మరెక్కడా కనబడదు. ఇతర మతాలలో దీనికి విరుద్ధం. అక్కడా వివిధ తెగలు, సంప్రదాయాలు ఉన్నాయి, ఒకరంటే మరొకరికి పడదు. వీటికి సంబంధించిన సమాచారం అంతర్జాలంలో అనేకం వచ్చినాయి. ఒక తెగ మరొక తెగకు వ్యతిరేకముగా నిరసనలు, అసమ్మతి ఎన్నో గమనించవచ్చు. అందువలనే అసూయతో, హిందువులలో ఐకమత్యానికి, శాంతికి విఘాతం కలిగించడానికి ఎన్నో దుష్టశక్తులు ఇదే పనిగా పనిచేస్తున్నాయి. వీరి వలలో మనం పడకూడదు. మనింటిలోని పిల్లలకి, యువతకి మన సనాతన సంప్రదాయం, గురువులకున్న గౌరవ స్థానం (శతాబ్దాల చరిత్ర కలిగిన ఎంతో పవిత్రమైన గురు-పరంపర కలిగిన సంస్థానాల గూర్చి) దయచేసి చెప్పాలి.
శ్రీరాముడు రామేశ్వరములో శివలింగ ప్రతిష్ఠ చేసి పరమేశ్వరుడిని ఆరాధించాడు. అదే విధముగా ఈశ్వరుడు, జగన్మాత పార్వతీదేవితో "శ్రీరామ" నామస్మరణ చేతనే శ్రీమహావిష్ణువుని సహస్రనామాలతో అర్చించిన ఫలితం కలుగుతుందని ఉపదేశించాడు. “శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్‌ం శివః” అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ ఇద్దరి రూపాలకి లేని బేధం అతి సామాన్యులమైన మనకెందుకు ? వారిని ఆరాధించే మనం, ఇలా చేస్తే వారిని అవమానించినట్లే కదా. తప్పు కదూ !
ప్రతిరోజు ఏదో ఒక చోట మన దేవాలయాలని-ఆస్తులని విధ్వంసం చేస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామనే కుతంత్రాలతో ఎన్నో దుష్టశక్తులు మన చుట్టూ నిత్యం పనిచేస్తున్న ఈ తరుణంలో మనం ఐకమత్యంగా ఉండాలి తప్ప, వారి ఊబిలో పడి భగవన్నామ స్మరణ మరచిపోయి మనలో మనం ఒకరినొకరు నిందలతో కాలాన్ని వృధా చేస్తూ ఆ భగవంతుని ఆగ్రహానికి పాత్రులవకూడదు, మహాపాపాన్ని కూడబెట్టుకోకూడదు.
హిందువులందరం ఎంతో విజ్ఞత కలిగిన సంస్కారవంతులం. ఇదే పరులకి ఈర్ష్య. అందుకనే దాడులు, వారి వారి ఏజెంట్‌ల ద్వారా మనల్ని విభజించే పనులు. మూర్ఖులం కాగూడదు సుమా !
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.