సనాతన ధర్మం కఠినముగా ఆచరించబడే పీఠం
"ప్రపంచములో సనాతన ధర్మం పూర్తి స్థాయిలో కఠినముగా ఆచరించబడే పరమ పవిత్రమైన పీఠం"
వారణాశి, సెప్టెంబర్ 29, ఆశ్వీయుజ శుక్ల చతుర్ధి : ఎంతో పవిత్రమైన, విశ్వసనీయమైన, గొప్ప గురు - పరంపర కలిగిన ఆధ్యాత్మిక సంస్థానం,ఈ సమస్త భూమండలములో "నిష్కళంకమైన ఒకే ఒక్క పీఠము" జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య స్థాపిత దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ అన్నారు.
సుమారు 1,230 సం.ల నుండి అవిఛ్ఛిన్నముగా కొనసాగుతున్న మహా మహిమాన్వితమైన గురు - పరంపర కలిగిన దివ్య క్షేత్రం 🌹 పచ్చటి పడమటి కనుమల పర్వత శ్రేణుల మధ్య, తుంగ నదీ సన్నిధిలో ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ఆహ్లాదకరమైన అద్భుత స్థలం. ఆదిశంకరుల విన్నపము మేరకు జగన్మాత ప్రత్యక్షమై శ్రీ శారదా దేవిగా స్థిరపడిన ప్రదేశం. తన దర్శనార్థం నిత్యం వేలాదిగా వచ్చే ప్రతి భక్తుడిని అనుగ్రహిస్తున్న అద్భుత స్థలం శృంగేరి అని శ్రీరామపాద తెలియజేశారు.
ఇక్కడ పీఠాధిపతులు నిత్యం బ్రహ్మ - నిష్ఠా గరిష్ఠులై, అనుక్షణం వేద - వేదాంగాలు, శాస్త్రాలు, భాష్యాలు అంతర్ముఖముగా లీనమై పరిశోధన, అధ్యయనం, సాధన చేస్తూ ఈ సమస్త మానవాళి సంరక్షణకై తాము ధర్మాన్ని అత్యంత కఠినముగా ఆచరిస్తూ, తపస్సంపన్నులై మాయకు లోనుకాకుండా ప్రజలకు బోధిస్తున్న పురుషోత్తములు. ఈ భూ లోకములో శృంగేరి జగద్గురువులకు మించిన జ్ఞాన సంపన్నులు మరొకరు లేరు. కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి - శృంగేరి శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి సమకాలీనులు, అవతార పురుషులని శ్రీరామపాద భాగవతర్ కొనియాడారు.
ఈ క్షేత్రములో అడుగుపెట్టిన ప్రతి ఒక భక్తుడి కుటుంబము జగద్గురువుల ఆశీర్వాద బలముచే సుఖ సంతోషాలతో ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందముగా ధర్మ మార్గములో జీవిస్తున్నారని శ్రీరామపాద చెబుతూ ఆనందం వ్యక్తపరిచారు 👏
వందే సనాతన గురు పరంపరామ్ 🙏🏼శారదే పాహిమాం, శంకరా రక్షమాం 🙏
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.





