పాశ్చాత్యులలో హిందూ దేవతలపై పెరుగుతున్న భక్తి !

పాశ్చాత్యులలో హిందూ దేవతలపై పెరుగుతున్న భక్తి !


భారతదేశ సంస్కృతికి ఆకర్షితులై, సంప్రదాయ పద్ధతిలో కట్టు బొట్టు ధరించి, శాకాహారమే భుజిస్తూ, పవిత్రంగా తదేక దీక్షతో ధ్యానం చేస్తూ, భగవద్గీత - రుద్రం పారాయణ చేస్తూ, భక్తి గాన పారవశ్యంలో నృత్యం చేస్తూ నిష్కల్మషమైన భక్తి భావముతో ఆనందిస్తున్న పాశ్చాత్యుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతోంది.

 





ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో సనాతన భారత సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది. అచ్చటి ప్రభుత్వాల సహకారంతో ఆ దేశ మతస్తులే నగర సంకీర్తన, రథ యాత్రలు నిర్వహిస్తున్నారంటే, హిందూ ధర్మ భక్తి మార్గం ఎంతటి ప్రాశస్త్యమైనదో సుస్పష్ఠం. విదేశీయులు భారతదేశానికి వచ్చి ప్రముఖంగా దేవాలయాలనే దర్శిస్తున్నారు. తులసి-రుద్రాక్ష మాలలు వేసుకొనటం, గోపి చందనం-విభూతి ధారణ చేయడం, సంప్రదాయ దుస్తులు ధరించడం, నామస్మరణ చేయడం వీరి దినచర్య అయ్యింది. అంటే, సత్యాన్ని గ్రహించగలిగే సద్బుద్ధి వీరికి కలిగినదని అర్థం.






మరి ఇక్కడే పుట్టి, ఇంతటి మహత్తర ప్రకృతిలో పెరిగిన మనకి ఎంతటి జ్ఞానము, ధర్మము, భగవంతునిపై భక్తి ఉండాలి ? నిజానికి ఇవన్నీ మనకి తెలియకుండా మన రక్తములో మిళితమై ఉన్నాయి. కాని, ఆ శక్తిని ఉత్తేజ పరచవలసిన చిన్న కర్తవ్యమును మాత్రమే పరమాత్ముడు మనపై పెట్టాడు. ఇది సాధన చేసినవారికి ఈశ్వరుడు వశం, తెలుసుకోలేని మూర్ఖులకు కలి వశం. ఉదాహరణకు, పాండవులకు నారాయణుడు వశం, విజయముతో పాటు అష్టైశ్వర్యాలు పొందారు. కౌరవులకు లాభములేని ఎన్నో హోదాలు, భవంతులు, మంది మార్బలం, హంగులు వశం, భ్రష్టులై అంతరించిపోయారు. కనుక, ఏది కావాలో సూక్ష్మ బుద్ధితో నిర్ణయించుకోవలసినది మనమే !

                                                                                        

                                                                                             శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.


Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper