ఎవరికి సాయం, దానం చేయకూడదు ?
ఎవరికి సాయం, దానం చేయకూడదు ?
శ్రీరామపాద కలం నుండి మహాలయ పక్ష ప్రత్యేకం
చెన్నై, భాద్రపద కృష్ణ తృతీయ, సెప్టెంబర్ 13 : ఈ కాలములో సహాయం అర్థిస్తూ చేయిజాపేవాళ్ళు ఎక్కువైపోయారని ఆధ్యాత్మికవేత్త, గాయకుడు శ్రీరామపాద భాగవతర్ విస్మయం చెందారు. అందునా పితృ పక్షం, కార్తీక మాసం మొదలైన విశిష్ఠ దినాలలో దానాలు ఎక్కువగా జరుగుతాయని ఆయన చెబుతూ ఈ సందర్భముగా కొన్ని సూచనలు చేశారు. ప్రతివాడికి సహాయం, దానం చేయవలదని అలా చేస్తే పాప భూయిష్టమౌతుందని ఆయన అన్నారు. వివరాల్లోనికి వెళితే,
1) చెడు స్వభావము కలిగిన వ్యక్తులకు;
2) ఎల్లప్పుడూ బాధలలో ఇరికిపోయినవారికి; సాధారణముగా వీరిలో చాలామందికి ఇతరుల ఆనందాన్ని, అభివృద్ధిని చూడలేక అసూయ, ఈర్ష్య ఆవహించియుంటారు.
3) తెలివి తక్కువ వారికి ;
4) వ్యసన పరులకు ;
5) ధర్మం, నీతిమాలిన వారికి ;
6) అర్హత తెలుసుకోలేక, పరులతో పోటీపడి అప్పులతో జీవనం గడిపేవారికి సహాయం, దానం చేయకూడదని శ్రీరామపాద భాగవతర్ చెప్పారు. ఇంకా,
7) ధనవంతునకు ;
8) జీవులను హింసించేవారికి ;
9) వడ్డీ వ్యాపారులకు ;
10) లాభార్జనే లక్ష్యంగా గుడులు, ఆశ్రమాలు నిర్మించేవాడికి,
11) ఇతరుల డబ్బుతో భోగమైన జీవనం గడిపేవాడికి ;
12) అర్చన/శాశ్వత పూజ, సేవల పేరిట ధనం తీసుకుని, దాతల గోత్ర నామాలతో పూజలు, హోమాలు చేయనివాడికి ధన, ద్రవ్యాలు దానమివ్వ వలదని శ్రీరామపాద సూచించారు.
13) ఒక కార్య నిమిత్తమై ధనం తీసుకుని, మరొక కార్యానికి దుర్వినియోగం చేసేవాడికి ;
14) పవిత్రమైన గుణం, స్వభావం, వ్యక్తిత్వం లేనివారికి ;
15) శాకాహారులు కాని వారికి (జీవ హత్యా దోషము వస్తుంది కనుక) ;
16) ఒకసారి మాట తప్పి మోసం చేసినవాడికి, మరలా సాయం తగదు ;
17) సత్యాన్ని అణగద్రొక్కేందుకు అవినీతి మార్గమును చేపట్టినవాడికి (గురువైనా సరే) జాగ్రత్త పడాలని శ్రీరామపాద అన్నారు.
18) పరులను అన్యాయముగా ఇబ్బంది పెట్టేవాడికి;
19) నమ్మశక్యము కాని మాటలు చెప్పేవాడికి, విశ్వాస ఘాతకుడికి;
20) అసత్య-అక్రమ-అవినీతి పరులకు, అధర్ములకు;
21) నికృష్ట బ్రహ్మచార్యులకు; భ్రష్ఠ సన్యాసులకు;
22) తల్లితండ్రులను, అత్తమామలను, వయసు మీరిన పెద్దలను హింసించేవారికి;
23) ధర్మాచరణకు, ధర్మానికి ఆటంకం కలిగించేవాడికి;
24) పరోపకారం చేయనివాడికి;
25) మరొకరి పేరు చెప్పుకుని పబ్బం గడుపునేవారికి;
26) అన్నదానం కోసం ఇచ్చిన ధాన్యం, ద్రవ్యం, సరకులను బహిరంగ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకునే వాడికి, వాడి సంస్థకు ;
27) స్వధర్మాన్ని విస్మరించేవాడికి దానం, చేయూత ఇవ్వడం నిషిద్దమని, అపాత్ర దానం పాప భూయిష్టమనేది ధర్మశాస్త్ర వచనమని శ్రీరామపాద గుర్తు చేశారు. దానం చేయాలనే సద్గుణం, సంకల్పం ఉండటం మంచిదే అయినా, అది పుచ్చుకోవడానికి ఎవరు అర్హులు అనేది అత్యంత ముఖ్యమని, ఇది అనుసరిస్తే దాతకు మంచిదని శ్రీరామపాద భాగవతర్ అన్నారు.
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.
