మీలో ఎవరు ధన్యులు ?
మీలో ఎవరు ధన్యులు ?
(అత్తివరద స్వామి వైభవం)
Athi Varadar Vaibhavam by Sriramapada Bhagavathar :
Though He comes out for every 40 years, we must keep cherishing the divine moments of His darshan in 2019 and chant his name till such time He wishes to come out for ever. Hope this happens soon 😑
ఏది అత్యంత పుణ్యం చేకూరుస్తుందో, అది మర్చిపోవడంలో మనం అగ్రగణ్యులం. సాక్షాత్ బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు విశ్వకర్మ తన చేతితో అత్తిచెట్టు కాండతో సృష్టించిన శ్రీమహావిష్ణువు విగ్రహం. కాంచీపురం వరదరాజస్వామి దేవాలయము కొలనులో నిక్షిప్తమై, ప్రతి 40 సం.లకు ఒకసారి మాత్రమే వెలుపలకు వచ్చి 48 రోజులు మాత్రమే తన భక్తులకు దర్శనం అనుగ్రహిస్తాడు. సం.2019లో కోట్లాది మంది భక్తులు గంటల తరబడి క్యూలో మెల్లిగా కదులుతూ మారుమోగే నామస్మరణ చేసుకుంటూ దర్శించుకున్నారు. తమ జన్మలు ధన్యమైనాయని తరించి పులకరించిపోయారు. ఒక్క క్షణం దర్శనముతో సకల అరిష్ఠాలను తొలగించడములో ఆ దేవదేవుడు ప్రసిద్ధుడు. తిరిగి సం.2059 లోనే ఆ పురుషోత్తముడి దర్శన భాగ్యం. ఎంతమందికి ఆ భాగ్యం కలుగుతుందో తెలియదు. కొంతమంది పండితులు, ఆచార్యులు అత్తివరదస్వామిని (కాంచీపురం వరదరాజస్వామి మూలమూర్తి) శాశ్వతముగా వెలుపలే ప్రతిష్ఠించాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఆ పురుషోత్తముడు అతిశీఘ్రముగా మన కోరిక మన్నించి బయటకు వస్తాడని ఆశిద్దాం 🙏🏻
తన భక్తుడి నోట "అత్తి వరదా" అని వినాలని ఆశతో చూస్తూ ఉంటాడట. ఈ వీడియోలో కీర్తన వింటూ ఆ స్వామిని స్మరిస్తే, ఆ స్వామి మహదానందపడిపోతాడు. మనకు అంతా శుభమే !
⯁ శ్రీరామపాద భాగవతర్
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.