పురందరదాసు ఆరాధనోత్సవం - పుణ్యతిథి

 పురందరదాసు ఆరాధనోత్సవం

పుష్య అమావాస్య

 

ఆయన ఒక యోగి, సంగీత విద్వాంసుడు, కవి, సంఘ సంస్కర్త, అన్నింటికి మించి పరమ భక్తుడు. సమాజములో భక్తి చైతన్యము తీసుకువచ్చిన మహనీయుడు. హిందువులైన ప్రతి ఒక్కరికి ఆయన ముఖ్యుడు, నిత్యం స్మరించుకోవలసిన పురుషోత్తముడు.

 

తన జీవితాన్ని బంగారు నగల వ్యాపారిగా మొదలుపెట్టి, సుమారు 30+ సం.లకే, నేటికి సుమారు 510 సం.ల క్రితమే రూ.9 కోట్లకు అధిపతి అయ్యాడు. అప్పుడు ఆయనను లౌకికం నుండి భక్తి మార్గంలోనికి మళ్ళించడానికి శ్రీమహావిష్ణువే బ్రహ్మను వటువుగా చేసుకుని ధన సహార్థియై ఆయన వద్దకు వచ్చాడు మరుక్షణమే అతనిలోని 'లోభం' వైరాగ్యానికి దారితీసింది. బంగారము, ధనముపై ఉన్న ఆశ పోయి, భగవత్ భక్తి వైపు దృష్టి మళ్ళింది. మనుష్యజన్మ సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణమే అన్నింటిని త్యజించి శ్రీహరికి దాసుడయ్యాడు. తదనంతరమే అద్భుతమైన గాత్రం ఉద్భవించింది. మధురమైన గానముతో శ్రీహరిని కీర్తిస్తూ, ఆ పరమాత్ముని కరుణ, కృప, లీలలు గురించి ప్రజలలో భక్తి చైతన్యం తీసుకువచ్చి పరమ భాగవతోత్తముడయ్యాడు. మరో ప్రక్క కుల, జాతి బేధాలను అంటరానితనాన్ని  ఖండించి తాను నివసిస్తున్న సమాజాన్ని ప్రక్షాళన చేసి, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయనే పురందరదాసు.




ఆయనే కర్ణాటక సంగీత పితామహుడు. అంతటి మహనీయుని ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, మరో ప్రక్క ఈ మధ్యకాలములో కొంతమంది చీడపురుగులు సమాజాన్ని పాడుచేస్తున్న తరుణములో మనందరము పురందరదాసు కీర్తనలతో ఈశ్వరునిపై భక్తిని పుణికిపుచ్చుకోవడమే కాకుండా, ఆయన అడుగుజాడల్లో నడచి కుల-మత-జాతి-వర్ణ బేధాలను ఖండించి సకల మానవాళి ఒకరికొకరు ప్రేమతో మెలిగే విధముగా నడుచుకోవాలి. చీడపురుగులను విస్మరిద్దాం! అప్పుడే మన పిల్లలకు శాంతి, సామరస్యముతో కూడిన సమాజాన్ని అందించిన వారవుతాము. ఆయన కీర్తనలను సరైన సరళిలో భక్తితో గానం చేయగలిగితే ఎవరైనా సరే శ్రీకృష్ణుడుఅదే, పంఢరిపురములోని విఠ్ఠలుడు మన ప్రక్కనే నిలబడియున్నాడని తెలుసుకుంటాం !

 

జై పురందర విఠ్ఠలా !


                                                                                 శ్రీరామపాద భాగవతర్ 


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada



Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.



Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper