కుటుంబం "బాధ - బాధ్యత" తెలుసుకో !

కుటుంబం "బాధ - బాధ్యత" తెలుసుకో !


శ్రీరంగం, అక్టోబర్ 27 : భగవంతుని సృష్ఠిలో కుటుంబం ఒక గొప్ప వరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భక్తి కీర్తన గాయకుడు శ్రీరామపాద భాగవతర్ అన్నారు.

కుటుంబం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా, కన్నీరే ఏరులై పారినా, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడమని, బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి; మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలని, అటువంటి వ్యక్తి ఒక్కడున్నా ఆ కుటుంబం ధన్యమని శ్రీరామపాద అన్నారు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా, ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం. ఇంటిలోని సమస్యలు నాలుగు గోడల మధ్య సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మూడవ వ్యక్తికి అవకాశం ఇస్తే, కుటుంబ గౌరవాన్ని రోడ్ మీద పడేసి భ్రష్టు పట్టిస్తాడు తప్ప ప్రయోజనం లేదని శ్రీరామపాద సూచించారు. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది, పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమేనని, ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదని శ్రీరామపాద భాగవతర్ చెప్పారు.

పరమాత్ముడు తీర్చిదిద్దిన కుటుంబాన్ని గౌరవంతో మరింత ప్రతిష్ఠించేవాడు ఉత్తముడైతే, బంధాలను విడగొట్టి అప్రతిష్ఠపాలు చేసేవాడు అధముడు. కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఇచ్చేవాడు మహాత్ముడు. అటువంటివానికి నమస్కరించి అనుసరించాలే తప్ప, కించపరిస్తే పరమాత్మ సృష్ఠించిన "కుటుంబ ధర్మానికి" వ్యతిరేకమై, నీవు ఎన్ని పూజలు, హోమాలు చేసినా శాశ్వత ఫలం లభించకపోగా పాపం మూటకట్టుకోవాల్సి వస్తుందని పురాణాలు, ఇతిహాసాల ద్వారా చెప్పబడ్డాయని శ్రీరామపాద ఉద్ఘాటించారు.




కుటుంబ విషయాలలో, కుటుంబ సభ్యులు కొందరు, తమ మధ్య వ్యూహాత్మకంగా, గుప్తంగా వ్యవహరించడం నిషిద్ధం. ఇది కుటుంబ ధర్మానికి విరుద్ధం. స్వలాభం కోసం పరితపించి ధర్మాన్ని వక్రీకరించి అసత్యముతో ఇతర కుటుంబసభ్యుల మధ్య ఉద్దేశ్యపూరితంగా ద్వేష వాతావరణాన్ని సృష్ఠించేవారికి జీవితం అతలాకుతలం అవడం, ప్రశాంతత లోపించడమే కాకుండా ఇహ-పర లోకంలో నరకయాతన తప్పదు. చేసిన తప్పిదం ఏదో రూపములో వెంటాడుతూనే ఉంటుందని, పశ్చాత్తాపానికి మించిన పరిష్కారం, వయసుతో నిమిత్తం లేదని శ్రీరామపాద సూచించారు.

కనుక, సంప్రదాయ సంస్కారములను పాటించాలి, కలిమి లేములతో.. కలసిన మనసులతో.. కలివిడిగా మసలుకోవాలి.. కలకాలం సుఖసంతోషాలు పంచుకోవాలని శ్రీరామపాద భాగవతర్ ఆకాంక్షించారు.

                                                                

                                                                            శ్రీరామపాద భాగవతర్ 

 


https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper