చేసిన తప్పులకు క్షమా ప్రార్థన అవకాశం "కార్తీకమాసం"

 చేసిన తప్పులకు క్షమా ప్రార్థన అవకాశం "కార్తీకమాసం"


పురాణ-ఇతిహాసముల సారం కార్తీకమాస-మహాత్మ్యం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ అన్నారు. కార్తీకమాస వైశిష్ఠ్యాన్ని ఆయన క్లుప్తంగా వివరిస్తూ, చేసిన తప్పులకు క్షమా ప్రార్థన చేసుకునేందుకు అవకాశం "కార్తీకమాసం" అని తెలిపారు.

ఉద్దేశ్య పూర్వకముగా చేసిన పాపాలు ఘోరనరకాలకి దారితీస్తాయని, కొందరు జీవితం ఆఖరి క్షణములో ధర్మాన్ని గ్రహించి భయభ్రాంతులై చింతించడమో ఏడవడమో చేస్తారని, మరికొందరు గతజన్మ దుష్టవాసన వదలలేక వికృత గుణాలని అంటిపెట్టుకునే ఉంటారని, వీరిద్దరికి దుర్గతి తప్పదని, పర్యవసానముగా ఎన్నోవేల నీచ జన్మలు ఎత్తవలసి వస్తుందని పురాణాలను ఉటంకిస్తూ శ్రీరామపాద తెలియజేశారు. దుష్ట స్వభావము కలిగినవారు ఎన్ని దేవాలయాలు దర్శించినా, జ్యోతిర్లింగ తీర్థ-క్షేత్రాలలో పూజలు, హోమాలు, అతిరుద్ర మహాయాగాలు చేసినా భగవత్కృప కలుగకపోగా ‘కలిపురుష సహవాసం’ మాత్రమే సిద్ధిస్తుందని ఇది ఎంతటి ప్రమాదమో తెలుసుకొనలేని ఆ..కలి అజ్ఞానులు భుజాలు ఎగురవేస్తారని శ్రీరామపాద అన్నారు.




మరికొందరు, తాము చేసిన తప్పులు, మోసాలు, పాపాలు త్వరలోనే తెలుసుకుని జీవితములో ఇక ముందు చేయకూడదని పశ్చాత్తాప పడతారని, ఇటువంటి వారికి ఈశ్వరుడు ప్రసాదించిన గొప్ప వరం "కార్తీకమాసం" అని ఆయన సూచించారు. తమని క్షమించమని పాదాలను పట్టుకుని కోరడం, బ్రాహ్మణ రూపేణా పలువిధముల పరిహారం చేసుకోవడం, పాపరాశిని కరిగించుకోవడానికి నదీ స్నానం చేయడం, నిష్కామ్యంగా, నిష్కల్మష మనసుతో రుద్రాభిషేకము, బిల్వార్చన చేయడం, పాపాంధకారము నుండి బయట పడవేయమని ఈశ్వరుని అర్థిస్తూ దీపారాధన చేయడం, దీపదానం చేయడం; గృహములో అయితే సూర్యోదయానికి ముందే "సప్త నది" స్మరణతో స్నానమాచరించడం, సంధ్యా సమయంలో తులసి చెట్టుకి పూజ చేసి దీపాన్ని సమర్పించడం, నిర్విరామంగా శివపంచాక్షరి మంత్రం, శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉండడం ఎంతో లాభదాయకమని, మంచి ఫలితాలను ఇస్తాయని శ్రీరామపాద భాగవతర్ సూచించారు.

దీపారాధన ప్రప్రధమముగా ఇంటిలో ఉత్తమం. సాయంత్రం శివ, విష్ణ్వాలయాలలోనూ, తీర్థాలలోనూ మహా శ్రేష్ఠం. ఆ పిదపే మరెక్కడైనా ! సాధ్యమైనంతవరకు బయట ఆహారాన్ని, ఇతరులు పెట్టిన ఆహారాన్ని త్యజించటం ఎంతో మంచిది.

వయసు మీరిన తరువాత చింతించి ప్రయోజనం లేదు. మరు క్షణం మన చేతుల్లో లేదు. కనుక కార్తీకమాస నియమాలు, విధులు అనుసరించి మంచి మార్గాన పడితే కుటుంబము, సంతతికి మంచిదని శ్రీరామపాద ధర్మసూక్షం తెలియజేశారు. 

ఓం నమః శివాయ 🙏ఓం నమో కార్తీక దామోదరాయ 🙏


                                                         శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper