నానా విధాలా ప్రకృతిని నాశనం చేయడం ఘోర తప్పిదం

శతృ దేశాలకు బుద్ధి నేర్పించాలి


ఆధ్యాత్మిక సాధనలో ఉన్నా కూడా, మనందరికి సామాజిక బాధ్యత ఎంతో ఉంది. ప్రత్యేకించి ప్రస్తుత విపత్కర పరిస్థితులు అన్నీ స్వయంకృతాపరాథమే కాక, ఈ శతాబ్దానికి చేదు అనుభవం.

2015 లోనే ఒకరు చైనా, మరొకరు అమెరికా శాస్త్రవేత్త ఇద్దరు కలిసి కరోనావైరస్‌ని ఘోరమైన కుట్రతో "ప్రపంచాన్ని నాశనం చేసి, మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశ్యంతో" చేసిన దుష్ట క్రియ. దీనికి అమెరికాకు చెందిన ఎన్నో సంస్థలు పరోక్షంగా తెలిసో, తెలియకో చేయూతనిచ్చాయని చదివాము. లోకమంతా అతలాకుతలం అవడానికి, ఎన్నో లక్షల అమాయక ప్రజల మరణానికి, కోట్ల మంది అనారోగ్యం పాలౌడానికి కారణమయ్యారు. ఇంకా వేలమంది, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ, వారి దోపిడీకి బలైపోతున్నారు.

 

ఇప్పడు మన కర్తవ్యం ఏమిటి? గుణపాఠం నేర్చుకుందామా !

 

ఒకటి, దుర్మార్గులకి, సహకరించిన వారికి సద్బుద్ధి కలిగేవిధంగా తగిన శాస్తి జరగవలసిందే. రెండవది ప్రధానమైనది, ప్రజలు గుర్తుంచుకుని ఆ రాక్షసులకి తగిన రీతిలో బుద్ధి చెప్పగలగాలి. ఇది చేయగలరా అనేదే ప్రశ్న. ఎందుకంటే మనకి మరచిపోయే గుణం, పరులకి మన సంపద ధారాదత్తం చేసే గుణాలు చాలా ఎక్కువ, మనం రోడ్ మీద పడినా కూడా. అన్ని కళ్ళారా చూస్తూనే ఉంటాం - మరిచిపోతాం, అనుభవిస్తూనే ఉంటాం - మరిచిపోతాం, వింటూనే ఉంటాం – విస్మరిస్తాం, నష్టపోతాం - అయినా మతిమరపు వ్యాధి మనలను పీడిస్తూనే ఉంది. ఈ అవగాహనా రాహిత్యమే, ఈ ఘోర తప్పిదాలే మనందరిని గత కొన్ని దశాబ్దాలుగా పలు రకాలుగా దెబ్బతీస్తూనే ఉంది. కాని, మనలో మార్పు రాలేదు. మనలో మంచి దిశగా మార్పు వస్తేనే, ఆ పరమాత్మ కూడా సహాయం చేస్తాడు. లేదా అనుభవించకతప్పదు.


నానా విధాలా ప్రకృతిని నాశనం చేయడం  ఘోర తప్పిదం


 

 


ఇప్పటికైనా


(1) చెట్లని, వృక్షాలని నరకటం ఆపుదామా ? 

(2) ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామా ?

(3) పట్టణాలలో మిగిలియున్న చెరువులను, కాలువలను, నదీ పరీవాహక ప్రాంతాలని కాపాడుకుందామా ? వీటి దురాక్రమణను నిరోధిద్దామా ?

(4) వీధులను శుభ్రపరచడం, పారిశుద్ధ్య పనులు నిత్యం జరిగేవిధంగా తగుచర్యలు తీసుకుందామా ?




"నానా విధాలా ప్రకృతిని నాశనం చేయడం  ఘోర తప్పిదం". ఈ తీరు మారకపోతే ప్రళయం ఎంతో దూరంలో లేదు సుమా !


చేయి చేయి కలపండి. వీధి వీధులుగా కమిటీలు ఏర్పరుచుకుని శుభ్రతని, ప్రకృతిని పోషించండి. మరొక ఉపద్రవం రానీయకుండా, మనలను మనమే కాపాడుకోవాలి. ఎవరో ఏదో ఉద్ధరిస్తారనుకుంటే పొరపాటే, మూర్ఖత్వమే !

 

ఒక్కటి సుస్పష్ఠం "మంచి జరగాలని ఉంటేనే, ప్రజలలో మార్పు వస్తుంది”.


                                                                                                     శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

 

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper