పరులతో పోలిక జీవితం అతలాకుతలం !

 పరులతో పోలిక !


చెన్నై, అక్టోబర్ 22, 2021 : నేటి సమాజములో నెలకొనియున్న కుటుంబ పరిస్థితులపై చెన్నైకు చెందిన ఆధ్యాత్మికవేత్త, సంప్రదాయ నామసంకీర్తన గాయకుడు శ్రీరామపాద భాగవతర్ మాట్లాడారు. మనము వారికంటే మేలు అని కొందరు అంటుంటారని, ఇంకొకరైతే ఎల్లప్పుడూ పరుల ఇంట్లో ఏ వస్తువున్నా, అది తన ఇంట్లో (అవసరమున్నా లేకున్నా) ఉండాల్సిందేనని అప్పు చేసైనా సరే కొనుగోలు చేస్తుంటారని, దురదృష్టవశాత్తు ఇటువంటి పోలిక ఆధ్యాత్మికములోనూ ఎక్కువైపోయిందని శ్రీరామపాద అన్నారు. అంటే ఇంకొకరితో పోటీగా, భౌతికముగా ఎదగటమే లక్ష్యముగా పెట్టుకున్నారని, ఇవి ఒక రకముగా మనిషి పతనానికి నాంది అని ఆయన అన్నారు. తమ చుట్టూ కలి ప్రభావముతో కూడిన పాప వలయం తిరుగడాన్ని అర్థం చేసుకొనలేక, అదే పుణ్యప్రపంచమని గందరగోళానికి గురై, భ్రమలో పడి దాని చుట్టూ తిరుగుతూ ఎంతో మంది తమ జీవితాలని నాశనము చేసుకుంటున్నారని శ్రీరామపాద అన్నారు.


నేటి సమాజములో నెలకొన్న విపరీత పరిస్థితుల నుండి బయట పడాలన్నా, సమాజములో శాంతి సామరస్యాలు నెలకొనాలన్నా మన కంటే ధర్మం, నీతి, నిజాయితీ, న్యాయ బుద్ధి, భక్తి శ్రద్ధలు కలిగిన ఉత్తములతో పోల్చుకోవాలని శ్రీరామపాద సూచించారు. ఇది అన్నివిధాలా శ్రేయస్కరమైన జీవితాన్ని కలిగిస్తుందని, రాబోయే తరాలు - పిల్లలు సన్మార్గములో ఉండే విధముగా కాపాడుతుందని ఆయన అన్నారు. అసూయ-ద్వేషం-అత్యాశ- అవినీతి-అక్రమం-అధర్మంతో కూడిన జీవనశైలిని గుర్తుపట్టి త్యజిస్తే మంచిదని శ్రీరామపాద ఆశాభావం వ్యక్తపరిచారు.


ఇతరులను మోసం చేసి జీవితంలో పైకి రాకూడదని, ఇది మహాపాపమని చెప్పారు. ఇతరులను ఉద్ధరించడానికి తన జ్ఞానాన్ని వారికి పంచాలే తప్ప, దీనిని వ్యాపారపరం చేయకూడదని, ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడని గుర్తుచేశారు. కొంతమంది అభాగ్యులు భగవద్గీత పారాయణ - ప్రవచనాలకు సైతం రుసుము సేకరిస్తున్నారని, ఇది చాలా విచారకరమని శ్రీరామపాద అన్నారు. సనాతన ధర్మము-సంప్రదాయాలపై మనకు ఉన్న అవగాహనా రాహిత్యమే అటువంటి వారికి పెట్టుబడని ఆయన హెచ్చరించారు. ఇవి విస్మరించిన వారికి ఏదో రకంగా కష్టమో, బాధో కలిగి దిక్కుతోచని పరిస్థితిలో మరొకరిని ఆశ్రయిస్తున్నారని, కనీసము ఇక్కడైనా మంచి అడుగువేశారా అంటే, అదీ ప్రశ్నేనని ఆయన అన్నారు! దొంగ స్వామీజీలు, అరకొర జ్ఞానం కలిగిన పలు రకాల శాస్త్రవేత్తలు ఉన్నారని, ప్రజలు జాగ్రత్త పడాలని, సరైన మార్గదర్శం కొరకు తరచుగా, ఎటువంటి స్వలాభాపేక్ష లేని బ్రహ్మశ్రీల ప్రవచనాలు వినడం, నామసంకీర్తన సత్సంగాలలో పాల్గొనడం, వేదఘోషలు వినడం చేయాలని శ్రీరామపాద భాగవతర్ సూచించారు.




వీటిని తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నవారిని ఆ పరమాత్ముడు చేయి పట్టుకుని పైకి లాగడం తథ్యమని ఆయన చెప్పారు. ‘తృప్తి’కి మించిన అనందము ఈ ప్రపంచములో మరొకటి లేదని శ్రీరామపాద అన్నారు.

                                                                                                 శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.

Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper