పీఠ నిర్వహణలో అలసత్వం వలదు !

"పీఠ నిర్వహణలో అలసత్వం, అజ్ఞానం, 
అజాగ్రత్త, అతివిశ్వాసం, అహంకారం వలదు"


విజయవాడ, శుభకృత్ ఆశ్వీయుజ బహుళ పంచమి, అక్టోబర్ 14, 2022 : ఆధ్యాత్మికములో విశిష్ఠమైన గురు-పరంపరకు చెందిన జగద్గురువులు నేటి సమాజానికి ఎంత ఉపయోగమో, వారి అధీనములోని పీఠాల న్యాయం, ధర్మబద్ధమైన నిర్వహణకు ఉత్తమమైన అధికారులు, పరిచారకులు, శిష్య సమూహం నుండి సలహాదారులు అవసరమని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ అన్నారు. నేటి సమాజములో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయని, ఊహించని అడ్డంకులు ఏ క్షణం ఎటువైపు నుండి వస్తాయో తెలియని పరిస్థితులు నెలకొనియున్నాయని ఆయన దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. ఇటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మిక పీఠ నిర్వహణ సామాన్యము కాదని, పీఠం పరిపాలనా యంత్రాంగం యొక్క లౌకికప్రపంచ వ్యవహార అనుభవం, విషయ పరిజ్ఞానం, సమయానుకూల అవగాహన ఎంతో దోహదపడుతాయని శ్రీరామపాద అభిప్రాయపడ్డారు. లేదంటే ఎటువంటి చిన్న పొరబాటు జరిగినా దాని ప్రభావం ఎంతో చరిత్ర కలిగిన పీఠముపై, ఆ పీఠాధిపతులపై పడుతుంది తప్ప దాని అధికారులు, పరిచారకుల మీద కాదని ఆయన చెప్పారు. ఎందుకంటే పురుషోత్తములైన జగద్గురువులు లౌకికప్రపంచ వ్యవహారాలతో సంబంధము లేకుండా, నిత్యం బ్రహ్మ-నిష్ఠా గరిష్ఠులై, అనుక్షణం వేద-వేదాంగాలు, శాస్త్రాలు, భాష్యాలు-బ్రహ్మ సూత్రాలను అంతర్ముఖముగా లీనమై ఈ సమస్త మానవాళి సంరక్షణకై పరిశోధన, అధ్యయనం, సాధన చేస్తూ ఉంటారని శ్రీరామపాద తెలియజేశారు. అందువలన పరిచారకులు, అధికార యంత్రాంగం ఎంతో అంకితభావముతో జాగ్రత్తగా పనిచేస్తూ బాహ్య ప్రపంచంలోని విషయాలను (ఏవైతే పీఠ నిర్వహణకు అవసరమో) సమయానుకూలముగా జగద్గురువుల దృష్టికి తీసుకువెళ్ళాలని, తద్వారా పీఠము యొక్క ధర్మం సర్వకాల సర్వావస్థలలోనూ మానావాళికి మార్గదర్శంగా విరాజిల్లుతుందని సూచిస్తూ శ్రీరామపాద భాగవతర్ ఆశాభావం వ్యక్తం చేశారు.




సూచన : ఒక ప్రక్క హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని ఎంతో మంది విశ్వప్రయత్నం చేస్తున్న విషయం అందరికి తెలిసినదే. నేటికీ ధర్మం నిలబడుతోందంటే శతాబ్దాల చరిత్ర గల పురాతన పీఠాల వలనే. ఆ జగద్గురువుల ధర్మ నిష్ఠకు భయపడే! అటువంటిది అక్కడి యాజమాన్యం చేతిలో చిన్న పొరపాటు జరిగినా కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్లే. ఎప్పటినుండో ఎంతో మంది "స్వయం ప్రకటిత దైవ పురుషులు", దొంగ స్వామీజీలు, ఆధునిక ఆచార్యులు, నకిలీ పీఠాధిపతులు, బాబాలు తమ లౌకిక వ్యవహారములను కప్పిపుచ్చుకోవడం కొరకు పురాతన పీఠాలపై బురద ఎలా జల్లాలా అని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే ఒక ఆధునిక ఆచార్యుడు తన ద్వేషాన్ని నోరు జారడం ద్వారా వెళ్ళగక్కాడు, అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్, నేను ఆ కోవకు చెందిన స్వాముల అధర్మాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానుకోండి. అయినప్పటికీ, ఎన్నో సంవత్సరముల తరువాత సత్యమైన మార్గం తెలుసుకుని, తమ మనసు ధర్మాచరణపై లగ్నము చేస్తున్న సమయములో ఆ భక్తులకు ఇటువంటివి భంగం కలిగిస్తాయి. దీనికి ఎటువంటి ఆస్కారము ఇవ్వకూడదనేది ఇచ్చట ఉద్దేశ్యము.

ఇంకా లక్షల కొద్దీ సరైన ఆధ్యాత్మిక మార్గాన పడాలి. సనాతన హిందూ ధర్మం ఎక్కడ కఠినముగా అమలవుతోందో తెలుసుకోవాలి, నిజమైన గురువుల చెంతకు చేరాలి !

                                                                                          శ్రీరామపాద భాగవతర్ 

 

https://www.facebook.com/Sriramapada.Bhagavathar/

https://www.youtube.com/@Sriramapada.Bhagavathar

facebook.com/Sriramapada

 

Note : 

 

Rights reserved. Copy, alteration, reproduction is prohibited. 

Sharing as it is permitted.






Popular posts from this blog

ప్రపంచం చుట్టూ తిరిగేవారు జగద్గురువులా ? జగదాచార్యులా ?

మహాలయపక్ష పితృకార్యాలు ... తప్పక చేయాలి

ஆன்மீகம் வியாபாரமா ... Editorial of a Leading Daily Paper