నీ అక్రమ సంపాదన, మంది మార్బలం నీ వెంటరావు
“కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. నీ అక్రమ సంపాదన, మంది మార్బలం, పలుకుబడి నీ వెంటరావు. అన్నీ ముళ్ళ పొదలే" సమాజములో నేడు నెలకొన్న కొంతమంది వికృత ప్రవర్తన, హిందూ సంప్రదాయాల పట్ల విచ్చలవిడి ప్రవర్తన, అసాంఘిక కార్యకలాపాలు, అసభ్యకరమైన నడవడిక మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు తక్షణమే దృష్టి పెట్టి భారతదేశ మహోన్నతమైన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను కాపాడాలని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ కోరారు. మహాభారత యుద్ధం పిదప శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అన్న మాటలను, గరుడ పురాణాంతర్గత కర్మ, శిక్షలను ఆయన ఈ సందర్భముగా ఉటంకించారు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, నీ నేరాలను పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరు శిక్షించ లేకపోయినా, నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుందని, వదలక వెంటాడి వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుందని, కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరని శ్రీరామపాద గుర్తుచేశారు. త్రవ్వి త్రవ్వి చూసుకుంటే, నీ జాడ నీ వ్యక్తిత్వం గురించి చెప్తుంది. ఇప్పటికైనా పశ్చాత్తాప పడి, మంచి మార్గాన్ని పట్టు. లేదంటే ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. పు...