Posts

Showing posts from May, 2024

“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ?

Image
“రామరాజ్యం” అంత తేలికగా సాధ్యమా ? “రామరాజ్యం” : ఆ పరిపాలన, పదానికి ఉన్న విలువను కాపాడాలి ! ----------- “రామరాజ్యం” అంటే పాలకునికి కావలసిన ఎన్నో మహోన్నత గుణముల సమాహారం. అందులో అత్యంత ముఖ్యమైనవి కొన్ని. 1) తన, పర భేదము లేకుండా సత్యనిష్ఠతో  ధర్మాచరణ  చేయడం. 2) కఠినమైన నీతి, న్యాయముతో వ్యవహరించడం. 3) ఋషి పరంపర నుండి వచ్చిన గురు-వాక్యాన్ని పాటించడం. 4) అస్మదీయ రక్షణ, పరుల శిక్షణ తగదు. 5) అన్ని మతాలను వర్గ భేదం లేకుండా సమదృష్టితో చూడటం. 6) ప్రజలను మోసపూరితముగా నమ్మించడం తగదు. 7)   ధనిక, పేద భేదం ఉండకూడదు. 8) ప్రజలకు కష్టం, నష్టం, బాధ, శోకం, విచారం, ఆపద, మానసిక అశాంతి - క్షోభ ఏ కోశాన కలిగించకూడదు. 9) స్వయముగా ప్రత్యక్షముగా వేద పోషణ, గో పోషణ, దేవాలయ పోషణ, నది - నదీ పరివాహక ప్రదేశాల రక్షణ, యాగాలు అణునిత్యం జరిగే విధముగా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ నిర్వహించేవారిని గుర్తించి గౌరవించడం, అన్ని రకాల చేయూతనివ్వడం. 10)   నిత్యం ప్రజలను ప్రాంతాలవారీగా కలిసి వారి బాధలు తెలుసుకుని నిస్పక్షపాతముగా వారికి అనువైన నిర్ణయాలు తీసుకోవడం. అర్థరాత్రి ఎవరైనా గంట కొడితే, వారికి ఏ ఆపద వచ్చిం...