Must Read .. ఆధ్యాత్మిక గురువు పాదాలకు పూజ చేస్తే కలిగే ప్రయోజనం !
గురువు పాదపూజ ఫలితం ! మీ పాదం మా ఇంట్లో పెడితే చాలని, ఏ గురువుని ఇంటికి తీసుకువచ్చి పాదపూజ చేసినా లేదా ఆయన నెలకొల్పిన ఆశ్రమానికి వెళ్ళి పూజలు చేసినా మన మనసులో ఈశ్వరుని తత్వం, ధర్మాచరణ, స్వధర్మం, సత్యము తెలుసుకునే దిశగా మార్పు రానంతవరకు ప్రయోజనము శూన్యం. అవతలి వ్యక్తికి మాత్రం పాదానికి లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలు లాభం. ఇదే ... నేటి ప్రపంచంలో విస్తృతమైపోయింది. కనుక వృధా ప్రయాసలు త్యజించాలి. ఆధునిక ఆధ్యాత్మిక భక్తి ప్రమాదకరం. ఇక్కడ అవతలి వ్యక్తి అంటే మన మధ్యే విస్తృతముగా తిరుగుతున్న కలి ప్రభావిత ఆధునిక గురువు / స్వామీజీ, మూలాలు లేని 'అవ' తార స్వరూపులు అని అర్థం. 'అవ' అంటే అక్రమం, నిషిద్ధమైన లక్షణం కలిగిన అని అర్థం. వీరు కామ (కర్మ) గురువులు అంటే ఎదో విధముగా ఎదురు ఆశిస్తారు. అక్రమాలను డబ్బుతో నొక్కిపెడతారు. వీరి మాటలకు అందరం బురిడీ కొట్టాల్సిందే. మనం బాహ్యంగా చూసేది వేరు. ఇది పసిగట్టడం చాలా కష్టం. గ్రహించాలంటే, ఎంతో ఆధ్యాత్మిక అవగాహన, సాధన అవసరం. గురు వు యొక్క పాద - పూజ చేసి నీ మిగతా స్వధర్మాన్ని నిర్వర్తించనక్కరలేదని ఏ శాస్త్రం చెప్పల...